Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

08-01-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మందుల స్టాక్ రిజిస్టర్‌తో పాటు వైద్య, పారామెడికల్ సిబ్బంది హాజరు రిజిస్టర్‌లను పరిశీలించారు. మందుల నిల్వల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎప్పటికప్పుడు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.వైద్య సిబ్బంది అందరూ విధి సమయానికి హాజరై బాధ్యతాయుతంగా పనిచేయాలని, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. రోగులకు ప్రభుత్వ వైద్య సేవలు సమర్థవంతంగా, నాణ్యంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణతో పాటు పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సబ్ కలెక్టర్ తెలిపారు.

Sthanikam

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News