Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి

28-12-2025 124 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సర్పంచులను అభినందించిన కందాళ ఉపేందర్ రెడ్డి

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులను అభినందించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వారు అధైర్యపడకుండా ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని భవిష్యత్‌కు సిద్ధం కావాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి కష్టసుఖాల్లో భాగస్వాములుగా నిలవాలని పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలనే కుటుంబంగా భావించి పనిచేస్తున్నానని పేర్కొన్నారు.

నేటి రాజకీయాల్లో ప్రజలను దుర్భాషలాడటం సరికాదని, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎందుకు తిట్లు తినాలనే అంశంపై నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీలకు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు.

రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

ప్రజలే కుటుంబం.. బీఆర్ఎస్ విజయమే లక్ష్యం: కందాళ ఉపేందర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News