Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

27-04-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్యసాయి జిల్లా,పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ స్వయంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.

ప్రజలు అందించిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదులను పరిశీలించి చట్ట పరిధిలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

ప్రతి ఫిర్యాదుదారునికి న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విచ్చేసిన వికలాంగులు తమ సమస్యలను తెలియజేయడానికి వచ్చిన విషయం గమనించిన జిల్లా ఎస్పీ స్వయంగా వారి వద్దకు వెళ్లి, వారి సమస్యలను ఓపికగా విన్నారు. వారి ఇబ్బందులను తెలుసుకుని, వెంటనే పరిష్కార దిశగా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు, మహిళలు వంటి సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, అందిన ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా పరిశీలించి న్యాయం జరిగేలా పోలీస్ శాఖ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు.

Sthanikam

ప్రజల ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News