Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:37 AM

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ

16-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవిత ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, భూ, పెన్షన్, రేషన్, గృహ నిర్మాణం, విద్యుత్, తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ప్రతి ఒక్కరి సమస్యను విన్న మంత్రి సవిత సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి సవితమ్మ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News