Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:57 PM

ప్రజల మనసులు గెలుచుకుంటున్న ఫరిదా బేగం జావీద్… 13వ వార్డులో మార్పుకు బాట

05-02-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఫరిదా బేగం జావీద్ ఇంటింటి ప్రచారంలో అపూర్వమైన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. ప్రతి గడపను తడుముతూ,ప్రతి కుటుంబాన్ని ఆత్మీయంగా పలకరిస్తూ స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకుంటూ,వాటికి శాశ్వత పరిష్కారాలు అందిస్తామని హామీ ఇస్తుండటంతో ఆమెకు ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.ఇంటింటి ప్రచారంలో భాగంగా ఫరిదా బేగం జావీద్ మాట్లాడుతూ, తాగునీటి సమస్యల శాశ్వత పరిష్కారం,పారిశుధ్య వ్యవస్థ మెరుగుదల,మెరుగైన రహదారులు,వీధి దీపాల ఏర్పాటు,మహిళలు–యువత సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.13వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన ఆశయమని ఆమె తెలిపారు.ప్రజల సమస్యలపై లోతైన అవగాహన, సేవాభావంతో కూడిన నాయకత్వమే తన బలమని చెబుతూ“13వ వార్డు అభివృద్ధి జరగాలంటే ‘ఎయిర్ కండిషన్’ గుర్తుకే మన ఓటు” అంటూ ఓటర్లను ఆకట్టుకునేలా పిలుపునిస్తున్నారు.ఆమె సాదాసీదా ప్రవర్తన, సమస్యలపై స్పష్టమైన దృక్పథం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో మహిళలు, యువత, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు. నిజాయితీ, సేవా దృక్పథం, అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉన్న నాయకురాలిగా ఫరిదా బేగం జావీద్‌ను ఘనంగా గెలిపించాలని ప్రజలు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు.“ఎయిర్ కండిషన్ గుర్తుకు ఓటు వేసి 13వ వార్డు అభివృద్ధికి బాట వేయుదాం – ఫరిదా బేగం జావీద్‌ను ఘన విజయం వైపు నడిపిద్దాం” అనే నినాదంతో ప్రచారం రోజురోజుకీ మరింత ఉత్సాహంగా, ఉధృతంగా కొనసాగుతోంది.

Sthanikam

ప్రజల మనసులు గెలుచుకుంటున్న ఫరిదా బేగం జావీద్… 13వ వార్డులో మార్పుకు బాట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News