Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:44 PM

ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజల మన్ననలు పొందుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
February 19, 2026 07:22 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు – పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట: ప్రజా పాలన అందిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన నివాసంలో ముఖ్య అనుచరుడు ధర్మకు స్వంతంగా లక్ష రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఐదు వందల రూపాయల వంటగ్యాస్, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల మన్ననలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొందారని అన్నారు. ముఖ్యమంత్రి కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సూర్యాపేట ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నలభై ఎనిమిది వార్డుల్లో ముప్పై ఒక వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నలగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూర్ రఘువీర్ రెడ్డి నాయకత్వంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత రాష్ట్ర సమితి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలుచుకుందని అన్నారు. గత ఎన్నికల్లో వారి నాయకత్వంలో ఇరవై నాలుగు స్థానాలు మాత్రమే గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు.

తమ ప్రభుత్వం ఎక్కడైనా తప్పులు చేస్తే సూచించాలని, కానీ కాంగ్రెస్ పని అయిపోయిందనే వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు. త్వరలో మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అనుసూచిత జాతులు, అనుసూచిత తెగలు, వెనుకబడిన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబంలాంటిదని, కార్యకర్తలను కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉపాధ్యక్షుడు షఫీ ఉల్లా, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు గట్టు శ్రీనివాస్, అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, ముదిరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్లు భైరబోయిన శ్రీనివాస్, పిల్లల భవాని రమేష్, నామ అరుణ ప్రవీణ్, జ్యోతి కరుణాకర్, గుణగంటి హేమ వంశీ, నాయకులు తండూ శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, నిమ్మల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News