Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:40 PM

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న:ఖేఢ్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

07-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్, 2వ వార్డు సభ్యురాలు సురేఖ, 6వ వార్డు సభ్యుడు లక్ష్మణ్, 13వ వార్డు సభ్యుడు వివేకానంద మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డులో రహదారుల దుస్థితి, మురికి కాలువలు, కాలువల వ్యవస్థలో లోపాలు వంటి సమస్యలను స్వయంగా పరిశీలించిన చైర్మన్, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కాలువల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్ సమస్యలపై విద్యుత్ శాఖ సహాయ ఇంజనీరు నారాయణతో మాట్లాడి తక్కువ విద్యుత్ ఒత్తిడి సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చామకురా పాండు, మైపాల్ రెడ్డి, జీవన్ శేట్, విట్టల్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న:ఖేఢ్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News