Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రెండు గంటల్లోనే వాహన దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:25 PM

ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లదే ప్రధాన పాత్ర

13-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కామేపల్లి మండలంలో నూతన దాబా హోటల్ ప్రారంభం – మేకల మల్లిబాబు యాదవ్ అభిప్రాయం

కామేపల్లి: సమాజంలో యాంత్రిక జీవనం పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి మారిపోయిందని, వారి కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మాజీ జిల్లా పరిషత్ సభ్యుడు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు.మండలంలోని పండితాపురం గ్రామంలో పశువుల సంత ఎదుట గ్రామ ఉపసర్పంచ్ మేకల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో శుక్రవారం నూతన దాబా హోటల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ధనియాకుల హనుమంతరావు, గ్రామ సర్పంచ్ ధరావత్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మానవ జీవనం నానాటికీ దశలవారీగా మారిపోతుందని తెలిపారు. గతంలో యంత్రాలు, ట్రాక్టర్లు లేని కాలంలో గ్రామాల్లో పాడి అభివృద్ధి చెందిందని, స్వచ్ఛమైన పాలు లభించేవని అన్నారు. ఉదయం ఇంటివద్ద టీ తాగి వెళ్లినవారు మళ్లీ టీ గురించి ఆలోచించేవారు కాదని పేర్కొన్నారు. కానీ నేడు వ్యాపారాభివృద్ధి, పనుల ఒత్తిడి కారణంగా ప్రజలు రోజులో అనేకసార్లు టీ త్రాగే అలవాటు చేసుకున్నారని అన్నారు.

ఇంటి వద్ద వంట చేసుకునే సమయం లేకపోవడం వల్ల బయట ఆహారం తీసుకునే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి అవసరాలను తీర్చేందుకు హోటళ్లు అవసరమయ్యాయని తెలిపారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తే హోటల్ వేగంగా అభివృద్ధి చెందుతుందని, హోటల్ యజమాని మేకల లక్ష్మీనారాయణ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో తోటకూరి శివయ్య, షేక్ రబ్బానీ పాషా, ధరావతులాల భూక్య నాగేంద్రబాబు, నల్లమోతు లక్ష్మయ్య, జన్నారపు లింగయ్య, జక్కంపూడి వెంకటేశ్వర్లు, బండి ఉపేందర్, తోటకూరి భద్రయ్య, చాకలి రాములు, డేరంగుల తిరపయ్య, రాయల నాగ శంకర్, పాటిబండ్ల ప్రసాదు, బాదావత్ నాగరాజు, బండి ఎల్లయ్య, బత్తల సంగయ్య, మేకల మహేష్ బాబు, గుగులోతు రవి, అంబడిపూడి వెంకటయ్య, ఉన్నం ప్రభాకర్, చింతల వెంకయ్య, పల్లె వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో హోటళ్లదే ప్రధాన పాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News