Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:18 PM

ప్రజల ఆరోగ్యంపై రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – నవజీవన్ రెడ్డి

08-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నివాస ప్రాంతంలో రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి

హయత్ నగర్: హయత్ నగర్ డివిజన్ పరిధిలోని శివాజీ కాలనీలో కొనసాగుతున్న రైస్ మిల్ ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదంగా మారిందని స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మిల్‌ నుంచి వెలువడుతున్న దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం, వ్యర్థాల కారణంగా కాలనీ మొత్తం కాలుష్య బారిన పడుతోందని, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలు తదితర అనారోగ్యాలతో బాధపడుతున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో శివాజీతో పాటు పరిసర కాలనీల ప్రజలతో కలిసి కార్పొరేటర్ రైస్ మిల్ వద్దకు వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి యాజమాన్యంపై నిరసన వ్యక్తం చేశారు. నివాస ప్రాంతంలో ఇలాంటి పరిశ్రమను నడపడం చట్ట విరుద్ధమే కాక ప్రజల ప్రాణాలకు ముప్పు అని అన్నారు. మిల్‌ను తరలించాలని గతంలో పలుమార్లు సూచించినా ప్రతి సారి గడువు పేరుతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.సంబంధిత శాఖలకు లిఖితపూర్వకంగా వినతులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని, ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సహించబోమని స్పష్టం చేశారు. వెంటనే రైస్ మిల్‌ను తరలించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మిథిలా నగర్ అధ్యక్షులు గంటా శ్రీధర్ రెడ్డి, బృందావన్ హోమ్స్ అధ్యక్షులు సత్తు నాగయ్య, శివాజీ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, బ్లోసమ్ సిటీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, లక్ష్మీగణపతి కాలనీ అధ్యక్షులు కృష్ణ రెడ్డి, దుర్గానగర్ అధ్యక్షులు బీరప్ప, లక్ష్మీప్రియా కాలనీ అధ్యక్షులు మధు, పీ అండ్ టీ కాలనీ అధ్యక్షులు పూర్ణయ్యతో పాటు వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల ఆరోగ్యంపై రైస్ మిల్‌ ముప్పు తక్షణమే తొలగించాలి – నవజీవన్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News