Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు

02-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బైకాని నరసింహ స్మారక స్థూపావిష్కరణ, సంతాప సభకు భారీ స్పందన

ప్రజా శ్రేయస్సు కోసం పోరాడిన కమ్యూనిస్టులు మరణించినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పేర్కొన్నారు. గ్రామంలోని సీపీఎం సీనియర్ నాయకుడు బైకాని నరసింహ స్మారక స్థూపావిష్కరణ, సంతాప సభ గ్రామపంచాయతీ కేంద్రంలో ఘనంగా జరిగింది.

స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే ప్రజా పోరాటాల్లో మమేకమైన నరసింహ గ్రామ ప్రజల మనసుల్లో చెదరని ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఆయన మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.

ప్రభుత్వాలు ప్రజలపై భారాలు మోపుతూ ధరలను పెంచుతున్నాయని, పేదల జీవన పరిస్థితులు దెబ్బతింటున్నాయని విమర్శించారు. ఎన్నికలను పెట్టుబడిగా మార్చి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పేదలకు నాణ్యమైన వైద్యం అందాలి

ఎం.డి. జహంగీర్ ఆందోళన

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.డి. జహంగీర్ మాట్లాడుతూ, పేదలకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. బైకాని నరసింహ కూడా మెరుగైన వైద్యం అందక మృతిచెందారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిస్తే పేదలకు ఉపశమనం లభిస్తుందని సూచించారు.

గోసంగి వేషంతో ఆకట్టుకున్న కళాకారులు

సంతాప సభలో ప్రజానాట్యమండలి కళాకారులు గోసంగి వేషంతో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కులవ్యవస్థ, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించారు. అమరవీరుల గీతాలతో సభకు ఉత్తేజం నింపారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా, మండల నాయకులు, సీఐటీయూ ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు బైకాని నర్మద, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కమ్యూనిస్టులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News