Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ

08-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గజ్జెల కాంతం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగింది. ఈ ప్రచారానికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి ఘన స్వాగతం పలికారు.నారాయణఖేడ్ మున్సిపాలిటీలో జరిగిన ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో, నాలుగో వార్డుల్లో విస్తృతంగా పర్యటించి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజలతో నేరుగా మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నారాయణఖేడ్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలపై స్పష్టంగా తెలియజేశారు.అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, నారాయణఖేడ్ పట్టణంలో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని పట్టణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పట్టణానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా, ప్రజల మద్దతుతో కొనసాగింది.

Sthanikam

ప్రజల ఆశీర్వాదాలతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News