Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:06 AM

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ ఆదేశాలు

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ ఆదేశాలు

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ ఆదేశాలు
December 29, 2025 05:19 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణి అర్జీలపై కలెక్టర్ సీరియస్ — పెండింగ్‌కు చోటు లేదు

యాదాద్రి స్థానికం ప్రతినిధి

ప్రజావాణిలో వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం కనిపించాల్సిందేనని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు ఫైళ్లలో మగ్గిపోవద్దని, సత్వర చర్యలతో ఫలితాలు కనిపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి మొత్తం 24 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి, స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

వచ్చిన అర్జీల్లో రెవిన్యూ శాఖకు 16, జిల్లా పంచాయతీకి 3, విద్యా శాఖకు 2, మున్సిపాలిటీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఎంప్లాయిమెంట్ శాఖలకు ఒక్కోటి చొప్పున వచ్చినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం మండల తహసీల్దార్లు, మండల స్పెషల్ ఆఫీసర్లతో నిర్వహించిన సమీక్షలో భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భూభారతిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఆయా మాడ్యూల్స్‌లో క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఆమోదం ఇవ్వాలన్నారు. తిరస్కరణ జరిగితే స్పష్టమైన కారణాలు భూభారతి మార్గదర్శకాలకు అనుగుణంగా నమోదు చేయాలని ఆదేశించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు తమ మండలాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా గురుకులాలు, వివిధ సొసైటీల రెసిడెన్షియల్ పాఠశాలల్లో బ్యాక్‌లాగ్, కొత్త అడ్మిషన్లకు సంబంధించిన అర్హత పరీక్ష పోస్టర్‌ను కలెక్టర్లు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభారాణి, జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, హౌసింగ్ పీడీ విజయసింగ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News