Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

ప్రజాప్రతినిధులు సేవకులుగా ఉండాలి.. ఆర్భాటాలకు పోకూడదు: సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి

24-12-2025 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాప్రతినిధులు నిరంతరం ప్రజలకు సేవకులుగా అందుబాటులో ఉండాలి తప్ప, కేవలం పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడకూడదని సీపీఎం సీనియర్ నాయకులు, వెలిమినేడు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి హితవు పలికారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలోని స్థానిక మేకల లింగయ్య స్మారక భవనంలో సీపీఎం మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా వెలిమినేడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తనను గెలిపించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన గెలుపుతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల్లో సీపీఎం బలపరిచిన వార్డు సభ్యులను గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తామని స్పష్టం చేశారు.

ఘనంగా సన్మానం: అనంతరం సీపీఎం, రైతు సంఘం, ఐద్వా సంఘాల నాయకులు కలిసి.. సర్పంచ్ బొంతల చంద్రారెడ్డిని, అలాగే వివిధ గ్రామాల్లో సీపీఎం తరఫున గెలుపొందిన వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, మల్లం మహేష్, జిట్ట సరోజ, మండల నాయకులు అరూరి శ్రీను, సీనియర్ నాయకులు పామనుగుళ్ళ అచ్చాలు, శీలా రాజయ్య, ఐతరాజు నర్సింహా, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, నెలికంటి నర్సింహా, జిట్ట స్వామి, పంది నరేష్, కల్లూరి కుమార స్వామి, కందగట్ల గణేష్, దేశబొయిన సరస్వతి, నాతి వెంకట్రామయ్య, లడే శ్రీను, అనిత, పామనుగుళ్ళ ధశరథ, గోపగోని వెంకన్న, కోనేటి రాములు తదితరులు పాల్గొన్నారు.
Sthanikam

ప్రజాప్రతినిధులు సేవకులుగా ఉండాలి.. ఆర్భాటాలకు పోకూడదు: సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News