Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:17 AM

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

01-01-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

ఖమ్మం: స్థానికం ప్రతినిధి జనార్ధన్

ప్రజా పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు నూతన సంవత్సరంలో కూడా ప్రతి అర్హుడికి చేరాలని దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా పాలనలో రెండేళ్ల కాలంలోనే “మంత్రి పొంగులేటి మార్క్” స్పష్టంగా కనిపిస్తోందని, సొంత నియోజకవర్గం పాలేరుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ సంక్షేమ పథకాల అమలులో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రి పొంగులేటి ప్రజా పాలన : తుంబూరు దయాకర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News