Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:13 AM

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

04-01-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జహీరాబాద్/న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. న్యాల్కల్ మండలంలోని ముంగి చౌరస్తా వద్ద ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచుల సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జ్ డా. చంద్రశేఖర్ మార్గనిర్దేశకత్వం వహించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభ జరిగింది. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్‌ను హాద్నూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మీర్ జహీరుద్దీన్ మూర్తుజ పూలమాల, శాలువాతో సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన జహీరుద్దీన్‌కు పార్టీ నాయకత్వం భరోసా కల్పిస్తూ, భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది.

కార్యక్రమంలో యువ నాయకుడు జిషన్ పటేల్, మాజీ ఎంపీటీసీ మొహమ్మద్ షుకూర్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి : ఎంపీ సురేష్ షెట్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News