Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేయాలి : ఎమ్మెల్యేలు

23-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీరు, సాగునీరు, రహదారులు, రైతు సమస్యలు తదితర అంశాల పరిష్కారానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కొత్త బోర్‌వెల్స్ మంజూరు చేయాలని, ఎమ్మెల్యే కోట కింద 40 శాతం ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు కోరారు. అలాగే జహీరాబాద్–గౌసాబాద్, బోనస్‌పూర్–తాండూర్, అల్గోల్, దిగ్వల్–సరసంఘం ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పూర్తయిన వేజ్–నాన్‌వేజ్ మార్కెట్ యార్డును ప్రజల వినియోగంలోకి తీసుకురావాలని కూడా కోరారు.పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన నియోజకవర్గంలో సాగునీటి సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి త్వరగా పరిష్కారం చూపించాలని కలెక్టర్‌ను కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ జొన్నల కొనుగోలు విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోందని, ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి వచ్చినప్పటికీ ప్రభుత్వం కేవలం 10 క్వింటాళ్లనే కొనుగోలు చేస్తోందని తెలిపారు. కనీసం ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, రోడ్లు, తాగునీటి సమస్యలు, మౌలిక వసతుల అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, తట్టు నారాయణ, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, చింత సాయినాథ్, గోవర్ధన్ నాయక్, సర్పంచ్ హరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేయాలి : ఎమ్మెల్యేలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News