Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:16 PM

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

10-03-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని నారాయణరెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

​తొలి 15 రోజులు పారిశుధ్యం: అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను వెంటనే పరిష్కరించాలి అని అధికారులకు సూచించారు. ఉగాది నాటికి తుది దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి, సామూహిక గృహప్రవేశాలు నిర్వహించాలి అని, పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని . డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలను అందుబాటులోకి తీసుకురావాలి తెలియజేశారు.

​నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ

గత రెండేళ్లలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ 99 రోజుల ప్రణాళిక ఉద్దేశమని అన్నారు. సన్నబియ్యం, ఉచిత విద్యుత్ (200 యూనిట్లు), మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. నకిరేకల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. గంజాయి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు యువత సహకరించాలని కోరారు.

​జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ,

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలు కీలక సూచనలు చేశారు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద మరణాల్లో 90 శాతం హెల్మెట్ లేకపోవడం వల్లే జరిగాయని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు.

​బ్లాక్ స్పాట్స్ తగ్గింపు: 2023లో 59గా ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లను 2025 నాటికి 31కి తగ్గించామని తెలిపారు.గంజాయి సమాచారం తెలిస్తే వెంటనే 8712670266 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీడీవోలు, తహసిల్దారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికతో అన్ని వర్గాల సంక్షేమం: జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News