Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:29 AM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పహడినగర్‌లో పారిశుద్ధ్య పనులు

10-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని 30వ వార్డు పహడినగర్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం మరియు వార్డు కౌన్సిలర్ ఎండీ.లయిక్ అహ్మద్ పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే వార్డులో ఉన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి కౌన్సిలర్ ఎండీ.లయిక్ అహ్మద్ పరిశీలించి,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Sthanikam

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పహడినగర్‌లో పారిశుద్ధ్య పనులు

Article Image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” కార్యక్రమం మార్చి 6వ తేదీ నుండి మార్చి 15వ తేదీ వరకు నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భువనగిరి పట్టణంలోని 30వ వార్డు పహడినగర్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం మరియు వార్డు కౌన్సిలర్ ఎండీ.లయిక్ అహ్మద్ పాల్గొని పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే వార్డులో ఉన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి కౌన్సిలర్ ఎండీ.లయిక్ అహ్మద్ పరిశీలించి,వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News