Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 02:24 AM

ప్రజా క్షేత్రంలో సాంబశివుని పోరాటం చిరస్మరణీయం

26-03-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండలో ఘనంగా 15వ వర్ధంతి వేడుకలు..

భువనగిరి జిల్లాకు సాంబశివుని పేరు పెట్టాలని డిమాండ్..

నల్లగొండ :పేద ప్రజల హక్కుల కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కొనపురి సాంబశివుడు అని పలువురు వక్తలు కొనియాడారు. బీఆర్ఎస్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మావోయిస్టు పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివుని 15వ వర్ధంతిని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నిర్వహించారు. యాదవ రాజ్యాధికార పోరాట సమితి (YRPS) రాష్ట్ర అధ్యక్షుడు చల్లా కోటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, 20వ వార్డు కౌన్సిలర్ అల్లి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ.. అడవిలో ఉన్నప్పుడు ఆదివాసుల హక్కుల కోసం, జనజీవన స్రవంతిలోకి వచ్చాక ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం సాంబశివుడు నిరంతరం శ్రమించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఆయన సేవలకు గుర్తింపుగా యాదాద్రి భువనగిరి జిల్లాకు 'కొనపురి సాంబశివుడు' పేరు పెట్టాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు బెల్లి నాగరాజ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు మామిడి పద్మ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, కట్ట శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే జిల్లా యాదవ సంఘం నాయకులు కన్నెబోయిన అంజిబాబు, కుంటిగొర్ల లింగయ్య, మిరియాల సైదులు, గుండెబోయిన సురేష్, మట్టిపల్లి సతీష్, బిఎస్ఎఫ్ ప్రవీణ్, మోదాల రాంబాబు, జానపాటి శంకర్, మేక శ్రీధర్ రెడ్డి, నడ్డి శంకర్, కిషోర్, యుగంధర్, బొల్లం లింగయ్య, గరిగంటి నాగయ్య, హరిబాబు, అనిల్, లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొని అంజలి ఘటించారు.

Sthanikam

ప్రజా క్షేత్రంలో సాంబశివుని పోరాటం చిరస్మరణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News