Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:59 AM

ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ..

ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ..

ప్రజా ఆరోగ్య సేవలపై కలెక్టర్ దృష్టి – ప్రత్యేక వైద్య శిబిరాల తనిఖీ..
March 26, 2026 08:23 PM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పీహెచ్‌సీలు,యూపీహెచ్‌సీలలో నిపుణులైన వైద్యులతో నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్ష శిబిరాలను గురువారం ఆమె పరిశీలించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి డిజిటల్ ఆరోగ్య వివరాల నమోదు,రోగుల వివరాల సేకరణ, నమోదు కౌంటర్ల పనితీరును పరిశీలించారు.రోగులకు ఇబ్బందులు కలగకుండా బాహ్య రోగుల నమోదు కౌంటర్లను పెంచాలని, అంతర్జాల వేగాన్ని మెరుగుపర్చాలని సూచించారు. అనంతరం బాహ్య రోగుల విభాగాలు, శస్త్రచికిత్స, స్త్రీ-పురుషుల వైద్య విభాగాలు, ఔషధ పంపిణీ కేంద్రం, నిల్వ గది, అత్యవసర సేవల విభాగాలను పరిశీలించి రికార్డుల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు.తరువాత మైనార్టీ నివాస పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్య పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు.రక్తహీనత, కంటి, చెవి, దంత సమస్యలు, పోషకాహార లోపాలను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. అనంతరం మార్క్స్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించి రోగులకు అందుతున్న సేవలు, ఆరోగ్య రికార్డులు, ఔషధ నిల్వలు, ప్రయోగశాల పనితీరును తనిఖీ చేశారు.జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News