Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి

18-03-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో విద్యా హక్కు చట్టం అమలుపై మరోసారి చర్చ మొదలైంది. ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లను భర్తీ చేయాలని కోరుతూ విద్యా నిర్వీజ్ఞ ఫౌండేషన్ అధ్యక్షుడు బోల్గురి ముకేష్, బుధవారం మండల విద్యాధికారి సైదా నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉచిత సీట్ల కేటాయింపును జాతీయ మిషన్‌గా భావించి కచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ నోటీసు బోర్డులపై అందుబాటులో ఉన్న ఉచిత సీట్ల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

ఉచిత సీట్ల కింద ఎంపికైన విద్యార్థుల నుంచి పుస్తకాలు, యూనిఫామ్ లేదా ఇతర పేర్లతో ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే కేవలం ఒకటో తరగతికే పరిమితం కాకుండా, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో కూడా పేద విద్యార్థులకు ప్రవేశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అంశంపై ఏప్రిల్ 30లోపు స్పష్టమైన కార్యాచరణ నివేదిక విడుదల చేయాలని ఫౌండేషన్ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై చర్యలు చేపట్టాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News