Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:24 AM

ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం

ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం

ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం
March 25, 2026 10:06 PM 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మూడు గంటల సుదీర్ఘ చర్చలు – ప్రజాహిత నిర్ణయాలకు ఆమోదం

చౌటుప్పల్ పురపాలక సంఘం రెండవ కౌన్సిల్ తొలి సాధారణ సమావేశం బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన ఉత్సాహభరితంగా, నిర్విఘ్నంగా మూడు గంటల పాటు జరిగింది. పట్టణాభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ సమావేశంలో ఎజెండాలోని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, ప్రజాహిత నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పావని రమేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. “పార్టీలకు అతీతంగా ప్రతి వార్డును అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి కౌన్సిలర్‌కు పూర్తి సహకారం అందిస్తాను. అదే విధంగా అందరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలి” అని కోరారు.అంశాల వారీగా లోతైన చర్చ

సమావేశంలో ప్రత్యేకంగా చైర్‌పర్సన్ స్వయంగా ఎజెండాలోని ప్రతి అంశాన్ని చదివి వినిపించగా, కౌన్సిలర్లతో విస్తృతంగా చర్చించారు. అవసరమైన చోట మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి నుంచి వివరణ కోరారు. అంశాలపై సమగ్ర అవగాహన సాధించిన అనంతరం కొన్ని అంశాలను సవరించాలని సూచించగా, మరికొన్ని కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.అభివృద్ధే ప్రధాన లక్ష్యం మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధే ప్రధాన ఎజెండా అని, అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ మాట్లాడుతూ ఇది తొలి సమావేశం అయినప్పటికీ సమస్యలు కొత్తవి కావని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో అన్ని వార్డుల కౌన్సిలర్లు పాల్గొని పట్టణాభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు (ఆర్, బీ నవీన్, మెడికల్ కాటమరాజు, అగ్రికల్చర్ నాగరాజు), మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్ దీప, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News