Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

ప్రధాని మోడీ సభకు భారీగా తరలిరావాలి : బీజేపీ నేతల పిలుపు

09-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోవూరి సంగమేశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు బలమైన నాయకత్వంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించారని అన్నారు. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి, దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడు మోడీ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వర్గ ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు విచ్చేస్తున్న ప్రధాని మోడీ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని కోవూరి సంగమేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ప్రధాని మోడీ సభకు భారీగా తరలిరావాలి : బీజేపీ నేతల పిలుపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News