Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:31 PM

పారదర్శక సేవలకే ప్రభుత్వ లక్ష్యం

పారదర్శక సేవలకే ప్రభుత్వ లక్ష్యం

పారదర్శక సేవలకే ప్రభుత్వ లక్ష్యం
14-01-2026 235 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గృహ జ్యోతి, ఉచిత వ్యవసాయ విద్యుత్ లబ్ధిదారులకు డిప్యూటీ సీఎం లేఖలు పంపిణీ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సామ విద్యాసాగర్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామంలో గృహ జ్యోతి పథకం, ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగ లబ్ధిదారులకు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పంపిన లేఖలను అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామ విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా ఈ వినూత్న కార్యక్రమం నిలుస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై మరింత స్పష్టత కలుగుతుందని, అలాగే విద్యుత్ శాఖ అధికారులు–ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. గృహ జ్యోతి, ఉచిత వ్యవసాయ విద్యుత్ వంటి పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, వీటిని నిజమైన అర్హులకే అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్‌మన్ బి. శ్రీనివాస్, సిబ్బంది సట్టు సాయితో పాటు స్థానికులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

పారదర్శక సేవలకే ప్రభుత్వ లక్ష్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News