Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:34 AM

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..
25-03-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

టెండర్ దారుల సమక్షంలో ప్రక్రియ పూర్తి..

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..

​నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్పోర్ట్ విభాగానికి చెందిన పాత, ఉపయోగించని సామగ్రిని టెండర్ దారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా బహిరంగ వేలం వేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఎస్పీ నియమించిన ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ నిర్వహించబడింది. కాలం చెల్లిన పాత టైర్లు, బ్యాటరీలు, ఖాళీ ఆయిల్ డ్రమ్ములు, ఇనుప విడి భాగాలు వంటి వివిధ రకాల పాత సామగ్రిని ఈ సందర్భంగా వేలం వేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, విధివిధానాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వేలం కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. పోలీస్ శాఖలో ఉపయోగించరాని పాత సామగ్రిని ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా కార్యాలయ ప్రాంగణంలో శుభ్రతను పాటించవచ్చని, అదే సమయంలో పారదర్శక వేలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. శాఖా పరమైన నిర్వహణను మరింత సమర్థవంతంగా చేసేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని వివరించారు.​జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో జరిగిన ఈ వేలం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్.బి డీఎస్పీ మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీను పాల్గొన్నారు. వీరితో పాటు మోటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ సూరప్ప నాయుడు, వెల్ఫేర్ ఆర్.ఐ సంతోష్ మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పారదర్శకంగా పాత సామగ్రి వేలం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News