Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మౌళిక వసతులకు సహకరిస్తాం : శ్రీ వాసవి సేవాసమితి

27-01-2026 122 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మౌళిక వసతుల కల్పనకు తమ వంతుగా సహకరిస్తామని శ్రీ వాసవి సేవాసమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం, కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మొరిశెట్టి అంతయ్య (ఎం.ఏ.ఏం) ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న 50 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను శ్రీ వాసవి సేవాసమితి కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు మిర్యాల సుధాకర్‌లతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 25న రథసప్తమి రోజున శ్రీ వాసవి సేవాసమితి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సంస్థ ద్వారా అనేక సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాపార రంగంతో పాటు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ ఆర్యవైశ్యులు ముందుండటం గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు స్థాపించిన మొరిశెట్టి అంతయ్య ఎం.ఏ.ఏం ప్రభుత్వ పాఠశాలలో మొదటి సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ వాసవి సేవాసమితి ద్వారా విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నవారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవాసమితి ఉపాధ్యక్షులు కుంచపర్తి రాజశేఖర్, ప్రధానోపాధ్యాయులు యాకయ్య, ఉపాధ్యాయులు సుమలత, ప్రభాకర్ రెడ్డి, మహేష్, రాధిక, వెంకటేశ్వర్లు, మురళి, ఉమారాణి, పద్మ, సైదమ్మ, పేర్మయ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మౌళిక వసతులకు సహకరిస్తాం : శ్రీ వాసవి సేవాసమితి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News