Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

09-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతు వారంలో మత్స్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

భువనగిరి :

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు వారము” కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో మత్స్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. చెరువుల అభివృద్ధి, చేప పిల్లల పంపిణీ, మత్స్యకారులకు ఆధునిక పరికరాల అందజేత, స్వయం ఉపాధి అవకాశాల కల్పన వంటి పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చేపల పెంపకం, మత్స్య సంపద అభివృద్ధి, రైతుల ఆదాయ వృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులు, మత్స్యకారులు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని కోరారు. ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో మరింత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ అధికారి రాజారామ్, సైంటిస్ట్ నాగరాజు, కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ వెంకటరెడ్డి, మత్స్యకార సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News