Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

16-05-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్,: ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1, యూనిట్–2 ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో “మీ ఆరోగ్యం.. మా ప్రాధాన్యత” అనే అంశంతో ఈ శిబిరాన్ని చేపట్టారు.

డా. కె. మల్లేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం విద్యార్థులు, అధ్యాపకులు, స్థానిక ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, షుగర్ పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచిత మందులు అందించారు.

కళాశాల ప్రిన్సిపాల్, ఎన్‌ఎస్‌ఎస్ చైర్మన్ డా. పి. సురేష్‌బాబు మార్గదర్శకత్వంలో కార్యక్రమం జరిగింది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు డా. ఇ. యాదగిరిరెడ్డి, డా. ఎస్. శారదాదేవి శిబిరాన్ని సమన్వయం చేశారు.

ఈ సందర్భంగా వైద్య బృందం ఆరోగ్య సంరక్షణ, జీవనశైలి వ్యాధులపై అవగాహన కల్పించింది. సమాజ సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వి. ఇందిరా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. డి. మధు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. బి. నరసింహ, లైబ్రేరియన్ డా. ఏ. దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ డా. కె. అనిత, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం. విద్యార్థులు, స్థానికులకు ఉచిత ఆరోగ్య సేవలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News