Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:28 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులకు సన్మానం

14-05-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు నాలుగో రోజు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని, తాము చదివిన విద్యాసంస్థను మరచిపోకుండా ప్రస్తుత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

కార్యక్రమ ఇన్‌చార్జి డా. డి. కిషన్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ కళాశాలను సందర్శిస్తూ తమ పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో తల్లిదండ్రుల సూచనలు, సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డా. జి. సునీత, డా. రాచమళ్ల శ్రీను, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డా. తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డా. ఎం. రవీందర్ రావు, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, కార్యాలయ సిబ్బంది ఫయాజ్, షరీఫ్, శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులకు సన్మానం

Article Image

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు నాలుగో రోజు ఘనంగా సాగాయి. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖాన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని, తాము చదివిన విద్యాసంస్థను మరచిపోకుండా ప్రస్తుత విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు.

కార్యక్రమ ఇన్‌చార్జి డా. డి. కిషన్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తరచూ కళాశాలను సందర్శిస్తూ తమ పిల్లల విద్యాభ్యాసంపై శ్రద్ధ చూపాలని అన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడంలో తల్లిదండ్రుల సూచనలు, సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు డా. జి. సునీత, డా. రాచమళ్ల శ్రీను, వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డా. లక్ష్మీ నీలిమ, అధ్యాపకులు డా. తండు కృష్ణ కౌండిన్య, ఎం. అనిత, డా. ఎం. రవీందర్ రావు, టి. శ్రీనివాస్, జె. నరేశ్, రవి, కార్యాలయ సిబ్బంది ఫయాజ్, షరీఫ్, శ్రీదేవి, నాగరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News