Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:08 PM

ప్రభుత్వ బడి చదువు.. ర్యాంకుల వెలుగు!

ప్రభుత్వ బడి చదువు.. ర్యాంకుల వెలుగు!

ప్రభుత్వ బడి చదువు.. ర్యాంకుల వెలుగు!
19-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎంసెట్‌లో సత్తా చాటిన నేలపట్ల విద్యార్థిని 'బుట్టి వెన్నెల'

​"ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఫలితాలు రావు" అనే అపోహను పటాపంచలు చేస్తూ, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ సామాన్య విద్యార్థిని రాష్ట్ర స్థాయి ర్యాంకుతో మెరిసింది.చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన బుట్టి వెన్నెల, ఇటీవల వెలువడిన తెలంగాణ ఎంసెట్ (EAPCET) ఫలితాల్లో 2184వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

​ఒకటో తరగతి నుంచి సర్కారు బడిలోనే..​వెన్నెల తన విద్యాభ్యాసాన్ని మొదటి నుంచి ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించింది.1 నుంచి 5వ తరగతి వరకు నేలపట్ల ప్రభుత్వ పాఠశాల.​ 6 నుంచి 10వ తరగతి వరకు రామన్నపేట మండలం జనంపల్లి గురుకుల పాఠశాల (10వ తరగతిలో 9.7 GPA సాధన). ​ఇంటర్మీడియట్ వరంగల్ జిల్లా హసన్‌పర్తి ప్రభుత్వ గురుకుల కళాశాల (MPC విభాగంలో 990 మార్కులు).

పైసా ఖర్చు లేకుండా.. ప్రైవేటుకు దీటుగా!

నేటి కాలంలో లక్షలాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ కళాశాలల్లో కోచింగ్ తీసుకుంటున్నా ఆశించిన ఫలితాలు రావడం కష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో, ఎటువంటి ప్రైవేటు కోచింగ్‌ తీసుకోకుండా, కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో చదివి వెన్నెల ఈ ఘనత సాధించడం విశేషం.వెన్నెల విజయం పట్ల ఆమె తండ్రి బుట్టి శ్రీనివాసులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేలా వెన్నెల సాధించిన ఈ విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు.

Sthanikam

ప్రభుత్వ బడి చదువు.. ర్యాంకుల వెలుగు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News