Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:16 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్‌ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్‌ మాతృనాయక్‌

12-05-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక జీజీహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమం నర్సింగ్‌ సూపరింటెండెంట్లు నీలిబాయి, సుజాత, రేణుకాదేవి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులను ఒకే వేదికపై పరిచయం చేసి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలు, కేక్‌ కటింగ్‌తో వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన నర్సులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్‌ మాతృనాయక్‌ మాట్లాడుతూ.. నర్సింగ్‌ వృత్తి సేవాభావానికి ప్రతీక అని అన్నారు. రోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

సమాజంలో నర్సులకు ప్రత్యేక స్థానం ఉందని, రోగులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎం చంద్రశేఖర్‌, స్టాఫ్‌నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నర్సుల దినోత్సవం. సేవాభావమే నర్సింగ్‌ వృత్తికి గుర్తింపు: డీసీహెచ్‌ మాతృనాయక్‌

Article Image

నల్లగొండ: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక జీజీహెచ్‌లో నిర్వహించిన కార్యక్రమం నర్సింగ్‌ సూపరింటెండెంట్లు నీలిబాయి, సుజాత, రేణుకాదేవి ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలందిస్తున్న నర్సులను ఒకే వేదికపై పరిచయం చేసి, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ఆటపాటలు, కేక్‌ కటింగ్‌తో వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన నర్సులను శాలువాలతో సత్కరించి బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న డీసీహెచ్‌ మాతృనాయక్‌ మాట్లాడుతూ.. నర్సింగ్‌ వృత్తి సేవాభావానికి ప్రతీక అని అన్నారు. రోగులను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

సమాజంలో నర్సులకు ప్రత్యేక స్థానం ఉందని, రోగులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎం చంద్రశేఖర్‌, స్టాఫ్‌నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News