Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:30 AM

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

03-01-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానిక ప్రతినిధి

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలిగా ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాలె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు విద్య ద్వారా వెలుగు చూపిన సావిత్రిబాయి పూలే కృషి అనన్యసాధ్యమని అన్నారు. విద్యే సామాజిక మార్పుకు బలమైన ఆయుధమని ఆమె జీవితం నిరూపించిందని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పున్నారావు, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, పుష్పలత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనోత్సవం

Article Image

రామన్నపేట స్థానిక ప్రతినిధి

ప్రభుత్వ జూనియర్ కళాశాల రామన్నపేటలో భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అధ్యాపకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలిగా ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ఈ రోజును మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించారు.

కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపల్ మాలె వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో మహిళలకు విద్య ద్వారా వెలుగు చూపిన సావిత్రిబాయి పూలే కృషి అనన్యసాధ్యమని అన్నారు. విద్యే సామాజిక మార్పుకు బలమైన ఆయుధమని ఆమె జీవితం నిరూపించిందని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పున్నారావు, మందడి వెంకట్ రెడ్డి, కిరణ్, నరసింహారావు, అశోక్, నగేష్, ఉపేందర్ రావు, అశోక్ రెడ్డి, జానయ్య, వెంకటేశ్వరరావు, శ్రవణ్, పరశురాములు, నిర్మల, కవిత, రాజేశ్వరి, ఉమారాణి, కరుణ, నాగమణి, పుష్పలత తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News