Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:27 AM

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ
December 17, 2025 07:03 PM 352 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణ

స్థానిక ప్రతినిధి:

మూడో తుదివిడత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్, మంచాల మండలం అఘపల్లి గ్రామంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, ఓటర్ల సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

రాచకొండ పరిధిలోని భువనగిరి కమిషనరేట్‌లో గుండాల, మోటకొండూరు, చౌటుప్పల్, నారాయణపూర్, మోత్కూర్, అడ్డగూడూరు, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల్, గ్రీన్ ఫార్మా, మాడ్గుల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో 163 బీఎన్‌ఎస్ (144 సెక్షన్) అమల్లోకి తెచ్చినట్లు సీపీ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో నలుగురికి మించి గుమిగూడరాదని స్పష్టం చేశారు.

పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ పూర్తై ఫలితాలు వెలువడే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని ఆదేశించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News