Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:36 AM

పొగమంచుతో ప్రమాద ముప్పు – రామన్నపేటలో వాహనదారులకు పోలీసుల హెచ్చరిక ఎస్ ఐ డి నాగరాజు

02-01-2026 180 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పొగమంచు ముప్పు.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా కమ్ముకుంటుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంటుండటంతో అతివేగం, ఓవర్‌టేకింగ్ అత్యంత ప్రమాదకరమని సూచించారు. హై బీమ్ లైట్లు వినియోగించకుండా లో బీమ్ లేదా ఫాగ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

లేన్ క్రమశిక్షణ పాటించకపోతే ప్రమాదాలు తప్పవని, పొగమంచు తీవ్రంగా ఉన్న సమయంలో వాహనాన్ని పక్కకు నిలిపి పరిస్థితి మెరుగయ్యాకనే ప్రయాణం కొనసాగించాలన్నారు. సడన్ బ్రేకింగ్ వల్ల వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున నెమ్మదిగా బ్రేక్ వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

చలికాలంలో రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ అని గుర్తు చేస్తూ, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామన్నపేట మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి. నాగరాజు

Sthanikam

పొగమంచుతో ప్రమాద ముప్పు – రామన్నపేటలో వాహనదారులకు పోలీసుల హెచ్చరిక ఎస్ ఐ డి నాగరాజు

Article Image

పొగమంచు ముప్పు.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలంలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా కమ్ముకుంటుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో ప్రమాదాల ముప్పు పెరిగిందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు, పాదచారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి నెలకొంటుండటంతో అతివేగం, ఓవర్‌టేకింగ్ అత్యంత ప్రమాదకరమని సూచించారు. హై బీమ్ లైట్లు వినియోగించకుండా లో బీమ్ లేదా ఫాగ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని, ముందున్న వాహనానికి తగినంత దూరం పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

లేన్ క్రమశిక్షణ పాటించకపోతే ప్రమాదాలు తప్పవని, పొగమంచు తీవ్రంగా ఉన్న సమయంలో వాహనాన్ని పక్కకు నిలిపి పరిస్థితి మెరుగయ్యాకనే ప్రయాణం కొనసాగించాలన్నారు. సడన్ బ్రేకింగ్ వల్ల వాహనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున నెమ్మదిగా బ్రేక్ వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

చలికాలంలో రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ అని గుర్తు చేస్తూ, ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రామన్నపేట మండల స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి. నాగరాజు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News