Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

"పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత"

30-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

"చట్టాలు ప్రజా ప్రయోజనార్ధం ఉంటాయి వాటిని దుర్వినియోగం చేయరాదు"

- జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ

మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలను సమగ్రంగా అమలు చేయడం, మహిళలందరికి పని ప్రదేశంలో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం బాధ్యతగా చూడాలని జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా సంక్షేమాధికారి నరసింహరావు అన్నారు. పని ప్రదేశశంలో మహిళలకు రక్షణ మరియు పోష్ చట్టం పై ఈరోజు ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని వెటర్నరీ మీటింగ్ హాల్ లో జరిగింది. ఈసందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల స్థానిక మరియు ఇంటర్నల్ పిర్యాదుల కమిటీ సభ్యులు, జిల్లా,మండల సమాఖ్య సభ్యులకు ఈ శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి శిక్షణలు మహిళలతోపాటుగా పురుషులకు కూడా అవసరమని, సంఘటిత రంగంతో పాటుగా అసంఘటిత రంగంలో కూడా అవగాహన కల్పించడం అవసరమని ఇంతటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆక్షన్ఎయిడ్ సంస్థను అభినందించారు.ఆక్షన్ఎయిడ్ ప్రతినిధి వందన పాల్ శిక్షణ ఇచ్చారు.ఈ సందర్భంగా వందనపాల్ మాట్లాడుతూ విశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా 2013లో పోష్ చట్టం వచ్చిందని. ఈ చట్టం ప్రకారం పని ప్రదేశంలో అంటే ఉద్యోగులతో పాటు అన్ని రంగాల మహిళలందరికీ ఈ చట్టం వర్తిస్తుందని, గృహ కార్మికులు,నిర్మాణ రంగ కార్మికులు,వీధి వ్యాపారులకు కూడా వర్తిస్తుందని అన్నారు.ఈ చట్టంలో గోప్యత ఉంటుందని బాధిత మహిళలు మూడు నెలలోపు స్థానిక పిర్యాదుల కమిటీకి పిర్యాదు చేయవచ్చని అన్నారు.మహిళలు,పిల్లలు,కార్మికులు ప్రజలందరి ప్రయోజనార్ధమే ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయని అంతటి గొప్ప చట్టాలు మనకు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలే తప్ప దుర్వినియోగం చేయరాదని అన్నారు.మహిళలందరికి రక్షణ కోసం,అభివృద్ధి,సాధికారత కోసం అనేక చట్టాలు పాలసీలు ఉన్నాయని వీటన్నింటి పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు.ఆక్షన్ఎయిడ్ ఆధ్వర్యంలో పోష్ చట్టం 2013పై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాదని అందులో భాగంగ యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. పోష్ చట్టం నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని సంస్థల్లో అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని ఇందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యత తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆక్షన్ఎయిడ్ హ్యూమన్ రైట్స్ డిఫెండర్ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితీ,డిప్యూటీ డిఎం అండ్ ఎచ్ వో డాక్టర్ యశోద,వీణ,సత్యవతి,సిడిపివోలు శైలజ,స్వరాజ్యం,యామిని,సమీరా వైద్యాధికారులు నితిష,నిరోష, మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి యశోద,హర్ష, నిఖిత,జిల్లా వ్యవసాయ శాఖ ఏడి నీలిమ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ నుండి రమణ మరియు స్థానిక పిర్యాదుల కమిటీ సభ్యులు లావణ్య, సుమలతలు ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల నుండి సూపర్వైజర్లు,సిబ్బందితో పాటు సుమారు ఎనబై అయిదు మంది పాల్గొన్నారు.

Sthanikam

"పని ప్రదేశంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత"

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News