Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:58 PM

పాలేరు మత్స్య పరిశోధన స్థానంలో బయోప్లాక్ చేపల సాగుపై మూడు రోజుల శిక్షణ విజయవంతం

పాలేరు మత్స్య పరిశోధన స్థానంలో బయోప్లాక్ చేపల సాగుపై మూడు రోజుల శిక్షణ విజయవంతం

పాలేరు మత్స్య పరిశోధన స్థానంలో బయోప్లాక్ చేపల సాగుపై మూడు రోజుల శిక్షణ విజయవంతం
February 05, 2026 06:06 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పి.వి. నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయము, హైదరాబాదు పరిధిలోని మత్స్య పరిశోధన స్థానం, పాలేరు ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు ఆర్థిక సహకారంతో తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులు మరియు మత్స్య రైతుల కోసం నిర్వహించిన బయోప్లాక్ విధానంలో చేపల సాగు అంశంపై మూడు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమం మూడవ రోజు విజయవంతంగా ముగిసింది.ఈ శిక్షణా కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల మరియు సూర్యాపేట జిల్లాల నుంచి మొత్తం ఇరవై ఐదు మంది మత్స్య రైతులు, మత్స్యకారులు పాల్గొన్నారు.ఈ రోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ నాబార్డ్, ఖమ్మం జిల్లా, శ్రీ ఎల్. సుజిత్ కుమార్ మాట్లాడుతూ మత్స్య రైతులు మత్స్య పరిశోధన స్థానం పాలేరు శాస్త్రవేత్తలు బయోప్లాక్ విధానంలో నేర్పిన ప్రతి మెలకువను క్షేత్రస్థాయిలో తప్పకుండా పాటించాలని సూచించారు. అలాగే నాబార్డ్ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మత్స్య రైతులు తరచూ చేసే పొరపాట్లను సరిదిద్దుకుంటూ మత్స్యరంగం ద్వారా తమ జీవితాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శ్యాం ప్రసాద్ , సీనియర్ మత్స్య శాస్త్రవేత్త మరియు అధిపతి, మత్స్య పరిశోధన స్థానం పాలేరు మాట్లాడుతూ బయోప్లాక్ చేపల సాగు విధానంలో శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తెలంగాణ మత్స్య రైతులు ఆచరణలో పెట్టి మంచి లాభాలు పొందాలని ఆకాంక్షించారు.అలాగే శ్రీ సిగ నాగరాజు , యంగ్ ప్రొఫెషనల్, మత్స్య పరిశోధన స్థానం పాలేరు మాట్లాడుతూ బయోప్లాక్ విధానంలో సాధారణంగా వచ్చే వ్యాధులు, వాటి నివారణతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీ పథకాలపై మత్స్య రైతులకు క్లుప్తంగా వివరించారు.డాక్టర్ కె. అరుణ్ , యంగ్ ప్రొఫెషనల్, మత్స్య పరిశోధన స్థానం పాలేరు బయోప్లాక్ విధానంలో ఉపయోగించే ఫ్లాక్‌ను క్షేత్రస్థాయిలో మత్స్యకారులు, మత్స్య రైతులు తమ స్వహస్తాలతో తయారు చేయించి, దాని ప్రయోజనాలను సవివరంగా వివరించారు.ఈ కార్యక్రమంలో కుమారి శ్రీ బానోతు దివ్య , డాక్టర్ కె. అరుణ్ కుమార్ , శ్రీ సిగ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News