Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

పోలీస్ నరేందర్ కన్నుమూత

పోలీస్ నరేందర్ కన్నుమూత

పోలీస్ నరేందర్ కన్నుమూత
29-12-2025 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడి ఓడిన పోలీస్ నరేందర్‌ ఖేడ్‌ ప్రాంతానికి చేసిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివని ప్రజలు భావోద్వేగంగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చేసిన సేవలు విడదీయరాని బంధంగా నిలిచాయని స్థానికులు తెలిపారు. మానవతా దృక్పథంతో ఆయన అవయవాలను దానం చేయడంతో మరికొందరికి కొత్త జీవితం లభించనుంది.

నరేందర్‌ మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలు రేపు సిద్ధిపేటలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

నరేందర్‌ సేవలను గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు, స్థానికులు ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పోలీస్ నరేందర్ కన్నుమూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News