Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:42 PM

పిల్లల భద్రతే లక్ష్యం – చైనా మాంజాకు దూరంగా ఉండండి:జిల్లా పోలీస్ శాఖ

03-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి:ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. చైనా మాంజా వల్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణ నష్టం జరిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా వినియోగం, విక్రయాలపై కఠినంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి నిషేధిత చైనా మాంజా నిల్వలను సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.జిల్లాలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగం లేదా విక్రయాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాలను నివారించి ప్రాణ భద్రతను కాపాడగలమని జిల్లా పోలీస్ శాఖ పేర్కొంది.

Sthanikam

పిల్లల భద్రతే లక్ష్యం – చైనా మాంజాకు దూరంగా ఉండండి:జిల్లా పోలీస్ శాఖ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News