Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:06 PM

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తా
February 03, 2026 12:23 PM 280 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వెన్ రెడ్డి సంధ్య రాజు

పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తానని చౌటుప్పల్ మున్సిపాలిటీలోని16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు,అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ లో 16వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్ రెడ్డి సంధ్య రాజు, తమ వార్డులో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మమున్సిపాలిటీలో 20 వార్డులలో కౌన్సిలర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపిస్తాయని వివరించారు.16వ వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తాను అన్నారు. వార్డు అభివృద్ధే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వార్డు ప్రజలు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.పదవి కోసం నేను నా భర్త వెన్ రెడ్డి రాజు రాజకీయం లోకి రాలేదని, చౌటుప్పల్ మున్సిపాలిటీ ప్రగతి కోసం సేవలందించడానికి వచ్చామని తెలిపారు.ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతోమున్సిపాలిటీలో 16వ వార్డును అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో నిలుపుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుగుల వెంకటయ్య, ఖలీల్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News