Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:52 AM

పైళ్ల శేఖర్ రెడ్డి నిర్ణయం… 32వ వార్డుకు తొలి బీ-ఫామ్

పైళ్ల శేఖర్ రెడ్డి నిర్ణయం… 32వ వార్డుకు తొలి బీ-ఫామ్

పైళ్ల శేఖర్ రెడ్డి నిర్ణయం… 32వ వార్డుకు తొలి బీ-ఫామ్
January 22, 2026 08:29 AM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బిఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసే దిశగా 32వ వార్డు

సర్వేలో 72శాతం మద్దతు… 32వ వార్డులో బిఆర్ఎస్ ధీమా

ముస్త్యాల హేమలత-ఆనంద్‌కు టికెట్… భారీ మెజారిటీతో గెలుపే లక్ష్యం

అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ పిలుపు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 32వ వార్డు తారక రామానగర్ నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముస్త్యాల హేమలత-ఆనంద్ కు తొలి బీ-ఫామ్ అందజేశారు. మాజీ ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ బీ-ఫామ్‌ను పార్టీ నేతలు కార్యకర్తల సమక్షంలో అందజేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి,రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు కోలుపుల అమరేందర్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థికి బీ-ఫామ్ లేఖ అందించారు.నేతలు మాట్లాడుతూ...భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉండగా,పార్టీ నిర్వహించిన సర్వే ప్రకారం 32వ వార్డులో బిఆర్ఎస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని,సుమారు 72 శాతం ప్రజల మద్దతు ముస్త్యాల హేమలత-ఆనంద్‌కు ఉన్నట్లు వెల్లడయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తొలి బీ-ఫామ్‌ను ఈ వార్డుకే కేటాయించినట్లు పేర్కొన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక కౌన్సిలర్‌తో కలిసి సీసీ రోడ్లు, డ్రైనేజీలు,మంచినీటి బోర్లు,వాటర్ ఫిల్టర్ ప్లాంట్,బస్తీ దవాఖానా,డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంలో మాజీ కౌన్సిలర్ గోమారు సుధాకర్ రెడ్డి వార్డు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ కౌన్సిలర్ గోమారు సుధాకర్ రెడ్డితోపాటు వ్యక్తిగా ముస్త్యాల హేమలత-ఆనంద్ గుర్తింపు పొందారని తెలిపారు.అలాగే,పార్టీ వార్డు అధ్యక్షుడిగా నిరంతరం కార్యకర్తలతో కలిసి పనిచేసి,గత అసెంబ్లీ ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పార్టీకి బలంగా నిలిచారని కొనియాడారు. ఈసారి 32వ వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెకు ఇది మంచి అవకాశమని, వార్డు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు గుర్తుచేస్తూ,ముస్త్యాల హేమలత-ఆనంద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,వార్డు ప్రజలు,మహిళలు,యువజన సంఘ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News