రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ దుర్మరణం
తిరుమలగిరి స్థానికం ప్రతినిధి రవి
తిరుమలగిరి మండలం తొండ గ్రామం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సతీష్ (45) దుర్మరణం చెందారు. తన స్వగ్రామం ఐనోలు నుంచి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న దెబ్బకు సతీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు, సహోద్యోగులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి