Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:33 PM

పదవి కాదు సేవే లక్ష్యం – నీర్నెముల నూతన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

17-12-2025 918 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధే నా తొలి లక్ష్యం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండల పరిధిలోని నీర్నెముల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కందిమల్ల గోపాల్ రెడ్డి సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. గెలుపు అనంతరం అక్షిత ప్రతినిధితో మాట్లాడుతూ, గ్రామానికి గత కొన్ని సంవత్సరాలుగా తాను నిర్వహించిన సామాజిక సేవలు, స్వచ్ఛంద కార్యక్రమాలే తన విజయానికి కారణమని పేర్కొన్నారు.

పదవి తనకు ముఖ్యం కాదని, గ్రామాభివృద్ధే తన తొలి లక్ష్యమని స్పష్టం చేసిన గోపాల్ రెడ్డి—అవసరమైతే తన సొంత నిధులతోనైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానన్నారు. గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

గ్రామాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తానని పునరుద్ఘాటించిన నూతన సర్పంచ్—తన గెలుపుకు సహకరించిన గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, యువకులు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆశీర్వదించి అవకాశం ఇచ్చినందుకు గ్రామానికి నిస్వార్థంగా సేవ చేస్తానని స్పష్టం చేశారు.

Sthanikam

పదవి కాదు సేవే లక్ష్యం – నీర్నెముల నూతన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News