Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

పదవ తరగతి చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

22-02-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలి.

భువనగిరి టౌన్:విద్యార్ధి దశలో పదవ తరగతి అనేది మొదటి మెట్టు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని బీచ్మహళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకొని అందులో పదవ తరగతి చదివే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, అని అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థులు అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకి వస్తున్నారా..లేదా ఎవరైనా గైర్హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. తదనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులను ఫిజిక్స్, గణితం సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేశారు. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి రెగ్యులర్ గా ఫార్ములాస్ ఒకటి రెండు సార్లు బట్టి పట్టినట్లయితే పాస్ మార్కులతో ఉత్తీర్ణత అయినట్టే అని తెలిపారు.పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున కష్టపడి చదవాలన్నారు.సెలవులో వాగుల్లో, చెరువుల్లో ఈత కు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోకుండా,పరీక్షల మధ్యలో రెండు రోజులు కూడా పాఠశాలకు వచ్చి ప్రిపేర్ అవ్వాలని సూచించారు.అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకి కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు. రైస్ క్వాలిటీ సరిగా లేకపోవడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు పోన్ చేసి బియ్యం వెంటనే మంచి బియ్యం సరఫరా చేయాలని,మెనూ ప్రకారం విద్యార్ధులకు రుచి కరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పదవ తరగతి చదివే విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News