Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:20 PM

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....

13-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

టాయిలెట్ వద్దు.. ఇబ్బందులు పడలేం...

25వ వార్డు ప్రజల ఆందోళన......

కోదాడ పట్టణంలోని 25వ వార్డు చేపల మార్కెట్ సమీపంలో పబ్లిక్ టాయిలెట్ నిర్మాణ ప్రతిపాదనపై వార్డు కౌన్సిలర్, స్థానికులు మండిపడుతున్నారు. గత పదేళ్లుగా వినియోగంలో లేని పాత టాయిలెట్‌ను కూల్చివేసిన అధికారులు, అదే స్థలంలో మళ్లీ కొత్తది నిర్మించాలని చూడటం సరికాదన్నారు. రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, మద్యం సేవించడం వంటివి సాగుతున్నాయన్నారు. ఇరుకైన గల్లీ కావడంతో వర్షం వస్తే నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీ నుంచి బస్టాండ్ వరకు పలు టాయిలెట్లు అందుబాటులో ఉన్నాయని అవే వాడకంలో లేవని వార్డులో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయమంటే నిధులు లేవని చెప్పే కమిషనర్ ప్రజలకు ఉపయోగపడని చోట నిధులు ఖర్చు చేయడం దుర్వినియోగమేనని విమర్శించారు. తమ అభ్యర్థనను కాదని ఇక్కడ టాయిలెట్ నిర్మించాలని చూస్తే ఊరుకోమన్నారు.ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ నిర్మించకుండా అడ్డుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ బాబా తాబుసం, జంపాల భద్రయ్య, భూలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మజీద్,ముత్యాలరావు, జాన్ బీ తదితరులు పాల్గొన్నారు......

Sthanikam

పబ్లిక్ టాయిలెట్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరం.....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News