Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 11:47 AM

ఊరు వెళ్తున్నారా! సోషల్ మీడియాలో పెట్టకండి

12-01-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఊరు వెళ్తున్నారా..! సోషల్ మీడియాలో పెట్టకండి

సంక్రాంతి సందర్భంగా ప్రజలకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచనలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే ప్రజలు తమ పర్యటన వివరాలను సోషల్ మీడియాలో స్టేటస్‌లు, పోస్టుల రూపంలో ప్రచురించవద్దని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలకు సూచించారు.ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో దొంగలు ఖాళీ ఇళ్లను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల ఇంట్లో నగలు, నగదు ఉంచకుండా వెంట తీసుకువెళ్లాలని లేదా బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే ఇంటిని విడిచి వెళ్లే ముందు పక్కింటి వారు, బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇవ్వాలని, ఇంటి పరిసరాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే చోరీలు, నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమని పేర్కొన్న ఎస్సై, భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఊరు వెళ్తున్నారా! సోషల్ మీడియాలో పెట్టకండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News