Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 AM

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

07-02-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వేచ్ఛాయుత ఎన్నికలకు పూర్తి బందోబస్తు

డిసిపీ భాస్కర్ పిలుపు

నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా డిసిపీ భాస్కర్ కోరారు.శనివారం బెల్లంపల్లి పట్టణంలోని జంబజార్ ప్రాంతంలో ఉన్న బ్రాంచ్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలో ఒక మేయర్, ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణ కోసం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.బెల్లంపల్లికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను బట్టి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.ఈ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రజలు భయాందోళనలేకుండా వినియోగించుకోవాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని డిసిపీ భాస్కర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ ఎస్ హెచ్ఓ శ్రీనివాస రావు, టూ టౌన్ ఎస్ ఐ కిరణ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటుహక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News