Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

ఓటింగ్‌కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు

09-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు.ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, మొత్తం 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పత్రాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డులు తదితరాలను పోలింగ్ కేంద్రాల్లో అంగీకరిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ ఓటు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

Sthanikam

ఓటింగ్‌కు గుర్తింపు తప్పనిసరి.. 18 కార్డులకు గ్రీన్ సిగ్నల్.కలెక్టర్ హనుమంతరావు

Article Image

భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల్లో ఈ నెల 11న జరగనున్న ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గుర్తింపు పత్రం తీసుకెళ్లాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు సూచించారు.ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదని, మొత్తం 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకదాన్ని చూపించి ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటోతో కూడిన బ్యాంకు లేదా తపాలా పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, పెన్షన్ పత్రాలు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డులు తదితరాలను పోలింగ్ కేంద్రాల్లో అంగీకరిస్తామని స్పష్టం చేశారు.ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య బలోపేతానికి తమ ఓటు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News