Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:30 AM

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

22-12-2025 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్‌పై దృష్టి… గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాల

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నేపథ్యంలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో రోజుకు కనీసం 10 వేల మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించి, నిర్దిష్ట గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే వారంలోగా మ్యాపింగ్ ప్రక్రియలో గణనీయమైన పురోగతి కనిపించాలని పేర్కొన్నారు.

మ్యాపింగ్‌తో పాటు ఓటర్ల జాబితాలో ఉన్న బ్లర్ ఫోటోలు, చిన్న ఫోటోలు, అస్పష్టమైన ఫోటోల గుర్తింపు చేపట్టాలని, ఫారం–8 ద్వారా అసలైన ఫోటోలు సేకరించి జాబితాను నవీకరించాలని తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియను 2026 జనవరి 13లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హనుమంత రావు, చౌటుప్పల్ రెవిన్యూ డివిజనల్ అధికారి శేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News