Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:37 AM

ఓటర్ల మనసు గెలవాలంటే కోట్లు అవసరం లేదు.. కేవలం ₹14 వేలతో ఎన్నికల బరిలో నిలిచిన కక్కిరేణి అభ్యర్థి!

21-12-2025 311 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కక్కిరేణి స్థానికం ప్రతినిధి :

ఎన్నికలు అంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అని భావించే ఈ రోజుల్లో, యాదాద్రి భువనగిరి జిల్లా కక్కిరేణి గ్రామానికి చెందిన వేముల వసంత సైదులు గారు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన ఆమె, కేవలం ₹14,000 ఖర్చుతోనే ప్రచారం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా, కేవలం సేవా దృక్పథంతో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు.

మొత్తం 2,060 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో, ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,842 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 89.42 శాతం పోలింగ్ నమోదైంది. ఈ హోరాహోరీ పోరులో వేముల వసంత సైదులు గారు 517 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి నైతిక విజయాన్ని అందుకున్నారు. సామాన్య ప్రజల నమ్మకాన్ని గెలవడానికి కోట్లు అవసరం లేదని, కేవలం నిజాయితీ ఉంటే చాలని ఆమె నిరూపించారు!

Sthanikam

ఓటర్ల మనసు గెలవాలంటే కోట్లు అవసరం లేదు.. కేవలం ₹14 వేలతో ఎన్నికల బరిలో నిలిచిన కక్కిరేణి అభ్యర్థి!

Article Image

కక్కిరేణి స్థానికం ప్రతినిధి :

ఎన్నికలు అంటే కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న పని అని భావించే ఈ రోజుల్లో, యాదాద్రి భువనగిరి జిల్లా కక్కిరేణి గ్రామానికి చెందిన వేముల వసంత సైదులు గారు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచిన ఆమె, కేవలం ₹14,000 ఖర్చుతోనే ప్రచారం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎటువంటి డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా, కేవలం సేవా దృక్పథంతో ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు.

మొత్తం 2,060 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో, ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,842 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా, 89.42 శాతం పోలింగ్ నమోదైంది. ఈ హోరాహోరీ పోరులో వేముల వసంత సైదులు గారు 517 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి నైతిక విజయాన్ని అందుకున్నారు. సామాన్య ప్రజల నమ్మకాన్ని గెలవడానికి కోట్లు అవసరం లేదని, కేవలం నిజాయితీ ఉంటే చాలని ఆమె నిరూపించారు!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News