Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:37 AM

ఒకే ఒక్క‌డు సినిమా చూపించాడు… 1995 చంద్ర‌బాబుని త‌లపించిన లోకేష్‌

17-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఒకప్పుడు ఆకస్మిక తనిఖీలు, స్పాట్ సస్పెన్షన్లు అన్నవి పరిపాలనలో కఠినతను సూచించే చిహ్నాలుగా నిలిచాయి. అదే తరహా శైలిని గుర్తు చేస్తూ తాజాగా మంత్రి నారా లోకేష్ చేసిన చర్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులు మంత్రి దృష్టికి వెళ్లాయి. పిల్లలే భోజనం బాగోలేదని చెప్పిన వీడియో బయటకు రావడంతో వెంటనే స్పందించిన మంత్రి, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలకు అందించే భోజనం రుచి, శుభ్రత, పోషక విలువల్లో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు.

ఈ ఘటన జరిగిన వారం రోజులకే లోకేష్ ఆకస్మిక తనిఖీతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో ఏపీఈడిబి కార్యాలయం ప్రారంభించిన అనంతరం షెడ్యూల్‌కు విరుద్ధంగా కాన్వాయ్ దారి మళ్లింది. ఏ సమాచారం లేకుండా నేరుగా మైలవరం పాఠశాలకు చేరుకున్న మంత్రి, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.

పిల్లలతో నేరుగా మాట్లాడిన ఆయన, వారి సమస్యలను తెలుసుకున్నారు. “మన పిల్లలకు ఇంట్లో ఎంత జాగ్రత్తగా భోజనం పెడతామో, అదే స్థాయి నాణ్యత విద్యార్థులకు ఉండాలి” అని స్పష్టం చేశారు. భోజనం నాణ్యత తగ్గితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు, భోజనం నచ్చకపోతే ఎలా ఫిర్యాదు చేయాలో కూడా విద్యార్థులకు వివరించారు. మంత్రి స్వయంగా భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు.

హఠాత్తుగా మంత్రి పాఠశాలలో ప్రత్యక్షం కావడంతో స్థానికం నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఒకరికి ఒకరు సమాచారం లేకపోవడంతో ఫోన్ కాల్స్ మోగిపోతూనే ఉన్నాయి. “మాకు తెలియదు” అంటూ అధికారులు పరస్పరం వివరణలు ఇచ్చుకుంటుండగా, మీడియా కూడా ఈ ఘటనను బ్రేకింగ్‌గా ప్రసారం చేసింది.

ఈ ఆకస్మిక తనిఖీతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో అప్రమత్తత పెరిగింది. 1995లో కనిపించిన పరిపాలనా కఠినతను మరోసారి గుర్తు చేస్తూ లోకేష్ చర్యలు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.

Sthanikam

ఒకే ఒక్క‌డు సినిమా చూపించాడు… 1995 చంద్ర‌బాబుని త‌లపించిన లోకేష్‌

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News